క్రైమ్/లీగల్

వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూన్ 19: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. సిట్ అధికారులు బుధవారం మరోసారి రంగంలోకి దిగి కేసుకు సంబంధించిన పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైఎస్.వివేకానందరెడ్డి మార్చి నెల 15వ తేదీ ఇంట్లోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. డీఎస్పీ రామకృష్ణ ఆద్వర్యంలో సిట్ బృందం వివేకా హత్య జరిగిన ఇళ్లు, పరిసర ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు చేశారని గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌ను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే హత్యతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుల వివరాలను ఇంతవరకు పోలీసులు వెల్లడించలేదు. మూడునెలలు దాటినా ఇంతవరకూ నిందితులను గుర్తించకపోవడం గమనార్హం. సిట్ అధికారులు ఇదివరకే దాదాపువందమందికిపైగా అనుమానితులను విచారించారు. వివేకా హత్యపై ఒక సిట్, పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే మరోసారి సంఘటనా స్థలాన్ని సిట్ అధికారులు బుధవారం పరిశీలించినట్లు తెలుస్తోంది. వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్యను పోలీసులు మరోసారి విచారించారు. పూర్తి సాక్ష్యాధారాలతో ప్రధాన నిందితుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. సిట్ అధికారుల వెంట పులివెందుల డీఎస్పీ వాసుదేవన్, సీఐలు అమీర్, శ్రీరాములు, రామాంజినాయక్ ఉన్నారు.

చిత్రం...వివేకా హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిట్ అధికారులు