క్రైమ్/లీగల్

100 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూన్ 19: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 100 కిలోల బరువు గల 50 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. గంజాయి వ్యాపారంలో భాగస్వాములైన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బుధవారం సాయంత్రం చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఇన్‌స్పెపెక్టర్ బీ.రవీందర్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండలం, చౌటకూరు గ్రామస్తుడైన వొన్నపురం రాజేందర్ (35) రామచంద్రాపురంలోని ఓల్డ్ ఎంఐజీ 384 ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేందర్‌కు నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన ప్రదీప్ పరిచయమై భారీగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి ముగ్గులోకి దింపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతానికి చెందిన చెన్నయ్య వద్ద నుంచి 100 కిలోల గంజాయి ప్యాకెట్లను తీసుకురావాలని, బాడుగ కింద రూ.30 వేలు ఇస్తానని చెప్పి పంపించాడు. అక్కడికి వెళ్లి వంద కిలోల గంజాయిని తన మారుతి బ్రెజ్జా కారులో నగరానికి తెచ్చాడు. మంగళవారం సాయంత్రం నల్లగండ్ల రైల్ విహార్ కాలనీ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అరెస్టు చేసి సెక్షన్ 20 (బీ) (2) (బీ) ఆఫ్ ఎన్‌డీపీఎస్ యాక్టు 1985 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి వ్యాపారస్తులైన ప్రదీప్, చెన్నయ్య పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన రాజేందర్ గతంలో రెండు సార్లు రూ.30 వేల బాడుగ కింద తక్కువ మోతాదులో గంజాయిని ఏపీ నుంచి నగరానికి తెచ్చినట్టు తెలిసింది. రాజేందర్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్‌ఐలు సలీమ్, జీ.శ్యాంప్రసాద్, క్రైమ్ ఏఎస్‌ఐ ఎం.నర్సింహా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, కానిస్టేబుళ్లు శివ గణేశ్, సాదిక్ అలీ పాల్గొన్నారు.
క్రైమ్ రివ్యూ మీటింగ్
రాజేంద్రనగర్, జూన్ 19: శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా చూసుకుంటూ పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించి సత్వరమే విచారణను పూర్తి చేయాలని సిబ్బందికి శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి సూచించారు. బుధవారం రాజేంద్రనగర్‌లో శంషాబాద్ జోన్ డీసీపీ పరిధిలోకి వచ్చే రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌లకు సంబంధించిన క్రైమ్ కేసులను తెలుసుకున్నారు. వాటిపై విచారణ జరిపేందుకు కావాల్సిన చర్యలను ఎలా తీసుకోవాలో వివరించారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ క్రిమినల్స్ ఎలాంటి వారైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు. ఎంతటి పలుకుబడి ఉన్నప్పటికీ సామాన్య ప్రజల జోలికి వస్తే సహించబోమని వివరించారు. సున్నిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిరంతరం నిర్వహించాల్సిందేనని వివరించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణలో పోలీసులు వేగం పెంచాలని తెలిపారు. వెంటనే విచారించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డు అందించి అభినందించారు.