క్రైమ్/లీగల్

లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: ఓ కల్లు దుకాణం నిర్వాహకుడి నుంచి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ, ఎస్‌ఐలను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ స్రవంతి తమ సిబ్బందితో కలిసి గత ఏప్రిల్ 25న గూపన్‌పల్లి శివారులోని కల్లు దుకాణంపై దాడి జరిపారు. కల్తీ కల్లు విక్రయాలు జరుపుతున్నారనే ఫిర్యాదు మేరకు శాంపిళ్లు సేకరించారు. అయితే శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించి వాటి నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాల్సి ఉండగా, సదరు ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోయారు. ఎలాంటి కల్తీ కల్లు విక్రయాలు జరగడం లేదని క్లీన్‌చిట్‌తో కూడిన నివేదికను ఇవ్వాలంటే తమకు 40 వేల రూపాయల ముడుపులను ముట్టజెప్పాలని కల్లు దుకాణం నిర్వాహకుడు పీ.రాజాగౌడ్‌ను డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో లంచం సమర్పించుకోలేనని రాజాగౌడ్ ప్రాధేయపడినప్పటికీ వినిపించుకోకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ, ఎస్‌ఐలు తరచూ ఆయనను వేధించడం మొదలుపెట్టారు. చివరకు కనీసం 30 వేల రూపాయలైనా ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో కల్తీ కల్లు పేరిట కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో తాళలేకపోయిన రాజాగౌడ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీంతో స్పందించిన ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి బుధవారం తన సిబ్బందితో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ స్టేషన్, ఇన్‌చార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. రాజాగౌడ్ చేసిన ఫిర్యాదుతో ముడిపడి ఉన్న పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 25న కల్లు దుకాణం నుండి శాంపిళ్లను సేకరించి, ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం, ఇతరాత్ర ఆధారాలను బట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ స్రవంతి లంచం డిమాండ్ చేసినట్టు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి వివరించారు.