క్రైమ్/లీగల్

డిగ్రీ విద్యార్థిపై కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 22: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్ రోడ్డు రేడియో స్టేషన్ సమీపంలో నివాసం ఉండే ఓ డిగ్రీ విద్యార్థి శనివారం ఉదయం కత్తిపోట్లకు గురయ్యాడు. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి విద్యార్థి గొంతు కోసి పరారయ్యారు. గాయపడ్డ విద్యార్థిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. రేడియో స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉండే మనోజ్ (18) ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. శనివారం తన ఇంటి వద్ద ఆరుబయట నిలబడి ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మోటార్ బైక్‌పై వేగంగా వచ్చి, మనోజ్ వద్ద వాహనం నిలిపారు. తమ వెంట తెచ్చుకున్న కత్తితో మనోజ్ గొంతు కోసి వచ్చినంత వేగంగానే అక్కడి నుండి ఉడాయించారు. ఈ ఘటనను చూసిన బాధితుడి కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున కేకలు వేయడంతో ఇక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యే లోపే ఆగంతకులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాల్గవ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మనోజ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. మనోజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధిత విద్యార్థికి పోలీసులు అనేక విధాలుగా ప్రశ్నించినప్పటికీ, దాడి చేసిన వారెవరూ, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటనే వివరాలు ఇంకనూ తెలియరాలేదు. తనకు ఎవరితోనూ శతృత్వం లేదని, దాడి చేసిన ఆగంతకులను తాను గుర్తు పట్టనని బాధితుడు మనోజ్ తెలుపడంతో పోలీసులు ఇతర కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.