క్రైమ్/లీగల్

లక్కీడిప్ పేరుతో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 22: అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని సబ్బులు కొంటే లక్కీడిప్‌లో బహుమతులు వచ్చాయంటూ నగదు కాజేసి బురిడీ కొట్టిస్తున్న ముఠాను గద్వాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ జక్కుల హనుమంతు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్నై రాష్ట్రం వెల్టూర్ జిల్లా ఆర్కట్‌కు చెందిన జేకే సతీష్‌బాబు, రాజశేఖర్, ఆనంద్‌కుమార్, శివకుమార్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన బాలాజీ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కర్నూల్, రైల్వేకోడూర్, మంచిర్యాల, రాయచూరు తదితర ప్రాంతాల్లో చీరలు, టీవీలు, ప్రెసర్ కుక్కర్లు అమ్ముతూ జీవనం కొనసాగించేవారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే మార్గంతో లక్కీడిప్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి సబ్బులు అమ్మేవారు. వినియోగదారులను ఆకర్షించి సబ్బులను అమ్మిన తర్వాత సబ్బుల లోపల లక్కీడిప్ కూపన్స్ ఉన్నాయని తెలిపేవారు. ఆ తర్వాత కొంత నగదు తీసుకొని వస్తువులను అందించేవారు. ఇదే క్రమంలో లక్కీడిప్‌లో భారీ వస్తువులు గెలుచుకున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేసి తర్వాత అందజేస్తామని చెప్పి, తప్పించుకు తిరిగేవారని సీఐ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం దోర్నాలలో ఈ ముఠా ఇంటింటికీ తిరిగి సబ్బులు అమ్ముతూ ఆరెపోగు నర్సింహ అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు. రూ.20కే మూడు సబ్బులమ్మగా, నరసింహకు లక్కీడిప్‌లో గ్రైండర్ వచ్చింది. అయతే రూ.3వేలు చెల్లిస్తే గ్రైండర్ ఇస్తామని చెప్పి అలాగే ఇచ్చారు. కొనాళ్లు ఇదే విధంగా గద్వాల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో తమ వ్యాపారాలు చేసి ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత దోర్నాలకే చెందిన నరసింహకు లక్కీడిప్‌లో రూ.1లక్ష విలువ చేసే బుల్లెట్ వాహనం వచ్చిందని, ముందుగా మీరు రూ.50వేలు చెల్లిస్తే మీకు బుల్లెట్ వాహనం డెలివరీ అందజేస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు. నర్సింహతో పాటు గద్వాల చుట్టు పక్క ప్రాంతాల్లో కొంతమంది వద్ద నుంచి లక్కీడిప్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. వాహనం రాకపోవడం, డబ్బులు వసూలు చేసిన వారి ఫోన్లు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన నరసింహ జూన్ 17న ధరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గద్వాల సీఐ జక్కుల హనుమంతు ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ ముఠా సభ్యులైన జేకే సతీష్‌బాబు, ఆనంద్‌కుమార్, శివకుమార్, రాజశేఖర్‌లను చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మరో వ్యక్తి బాలాజీ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, లక్కీడిప్ కూపన్స్‌ను స్వాధీనం చేసుకుని, గద్వాల కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జక్కుల హనుమంతు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన పోలీసులను సీఐ అభినందించారు.
చిత్రం...నిందితుల అరెస్టు చూపి, వివరాలు వెల్లడిస్తున్న సీఐ హనుమంతు