క్రైమ్/లీగల్

యువకుడి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 23: స్నేహితుని వివాహానికి హాజరు అయ్యేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడాలో నివాసం ఉండే ముంతాజ్ బేగం కుమారుడు గౌస్ పాషా(36) టైలర్‌షాప్ నిర్వహిస్తుంటాడు. ఈనెల 16న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బీదర్‌లో తన స్నేహితుని వివాహ కార్యక్రమం ఉందని, అక్కడికి వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గౌస్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అతని స్నేహితులకు ఫోన్ చేసి విచారించినా గౌస్ ఆచూకి లభ్యం కాలేదు. తల్లి ముంతాజ్ ఆదివారం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.