క్రైమ్/లీగల్

మేడ్చల్‌లో వృద్ధుడి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 23: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన జీ. పాండు(62) కుటుంబ కారణాలతో ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. పాండు భార్య, కుమారుడు, కూతురు నగరంలోనని మోండా మార్కెట్ ప్రాంతం వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో పాండు అప్పుడప్పుడు మోండా మార్కెట్‌లోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేవాడు. పాండు తమ్ముడు రామకృష్ణ కూడా వారంలో ఓసారి గౌడవెళ్లిలోని పాండు వద్దకు వస్తుండేవాడు. ఈ నెల 21వ తేదీన రామకృష్ణ అన్న పాండును చూసేందుకు గౌడవెళ్లి గ్రామానికి రాగా ఇంటిలో పాండు కనిపించలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఈ నెల 17వ తేదీ నుంచి పాండు కనిపించడం లేదని వివరించారు. దీంతో తెలిసిన చోట్లా, బంధువుల వద్ద పాండు ఆచూకీ కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడం కుమారుడు గోపీకృష్ణ ఆదివారం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ఉంది.