క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఒంగోలులో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పీ సిద్దార్ధ కౌశల్ తెలిపారు. ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన షేక్ బాజీ, టంగుటూరు మండలం నిడమానూరు గ్రామానికి చెందిన రావుల శ్రీకాంత్‌రెడ్డి, మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన పత్రా మహేష్‌తో పాటు మరో ముగ్గురు మైనర్లను కూడా అరెస్టుచేసి వారిని వేరేచోటకు తరలించినట్లు తెలిపారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారని ఎస్‌పీ పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని నల్లచెరువుకు చెందిన ఒక మైనర్ బాలిక తన తాత అనారోగ్యంతో బాధ పడుతుండగా విజయవాడలోని ఒక ఆసుపత్రి వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన అమ్మిశెట్టి రాము అనే కారుడ్రైవరు కూడా అతనికి చెందిన వారికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో విజయవాడ ఆసుపత్రి వద్దకు వెళ్లినట్లు తెలిపారు. ఈక్రమంలో అక్కడ రాముతో ఆ బాలికకు పరిచయం ఏర్పడిందన్నారు. అయితే ఆ బాలిక రాముతో ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని తల్లి గమనించి భయపెట్టడటంతో తల్లిపై కోపంతో అక్కడ నుండి 16వ తేదీ సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో ఒంగోలులోని ఆర్‌టిసి బస్టాండులోని కెఆర్ మొబైల్‌షాపు వద్దకు చేరుకుందన్నారు. ఆ షాపులో ఉన్న షేక్ బాజీ అనే వ్యక్తి బాలిక అక్కడ ఉండటాన్ని గమనించి మాటలు కలిపినట్లు తెలిపారు. ఈక్రమంలో బాలిక తనతో పరిచయం ఉన్న రాముకు ఫోన్ చేయగా కలవలేదని తెలిపిందన్నారు. అనంతరం బాజీ ఆమెను షాపులోకి తీసుకెళ్లి అక్కడే అత్యాచార యత్నం చేసి రాత్రంతా అక్కడే ఉంచినట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీన ఒంగోలు ఆర్‌టీసీ బస్టాండు సమీపంలోని ఒక మెడికల్ షాపుపై ఉన్న గదికి తీసుకెళ్లాడన్నారు. బాజీ స్నేహితుడితో పాటు మరో మైనర్ బాలుడు, ఆవుల శ్రీకాంత్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఆ బాలికను గదిలోనే బంధించి వారు బయటకురాగా ఈనెల 19వ తేదీన పత్రా మహేష్ అనే బాలుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడన్నారు. 20 నుండి 22వ తేదీ వరకు బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారన్నారు. ఈనెల 22వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు ఓ మైనర్ బాలుడు బాలికను బస్టాండు వద్దకు తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయాడన్నారు. దీంతో అక్కడ ఉన్న శక్తి టీం సిబ్బంది బాలిక బాధ పడుతుండడాన్ని గమనించి ఆమె నుండి వివరాలు సేకరించారని చెప్పారు. వెంటనే వారు ఆ బాలికను ఒంగోలులోని మహిళా పోలీసుస్టేషన్‌లో అప్పగించారన్నారు. ఈనెల 22వ తేదీ రాత్రి 10 గంటలకు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారన్నారు. ఆ తరువాత బాలికను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించినట్లు ఎస్‌పి చెప్పారు. ఈ కేసులో మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఎస్‌పి పేర్కొన్నారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను 24 గంటలలోపే తమ సిబ్బంది అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో సెల్‌షాపు యజమాని కీలక సూత్రధారిగా భావిస్తున్నామని ఎస్‌పీ తెలిపారు. ఇదిలావుండగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు. కాగా ఈ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ ఆరా తీశారు.