తెలంగాణ

పత్తి గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూన్ 23: నాగర్‌కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ గోడౌన్‌లో భద్రపర్చిన పత్తి అగ్నికి ఆహూతి కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. శ్రీకృష్ణ కాటన్ మిల్లు, గోడౌన్ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం. శనివారం అర్థరాత్రి పతిబేళ్లు నిలువ ఉన్న గోడౌన్ నుంచి పొగలు వస్తున్నాయని తెలియడంతో హుటాహుటిన వచ్చిచూడగా వాటి నుంచి భారీగా మంటలు వస్తుండటాన్ని గమనించి వెంటనే నాగర్‌కర్నూల్ అగ్నిమాపకదళ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. పట్టణంలో అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకర్లను రప్పించడంతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పడం ప్రారంభించారు. అర్ధరాత్రి మొదలైన ఈ మంటలు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. ఈ మంటలలో 5600 బేళ్లు అనగా సుమారు 969 టన్నుల పత్తి దగ్ధమైందని, ఇందులో శ్రీకృష్ణ కాటన్ మిల్లుకు చెందిన 765 టన్నులు, వేంకటేశ్వర ట్రేడర్స్‌కు చెందిన 204 టన్నులు ఉన్నట్టు తెలిపారు. రైతుల నుంచి కొనుగోళ్లు చేసిన పత్తిని ప్రైవేట్ గోడౌన్‌ను అద్దెకు తీసుకొని భద్రపర్చినట్టు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈ గోడౌన్ పక్కనే ఉన్న మరో గోడౌన్‌లో భారీగా వేరుశనగ నిలువలు ఉండటంతో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే వాటిని మరో గోడౌన్‌లోకి మార్చడం ప్రారంభించారు. ముందుజాగ్రత్తగానే వేరుశనగ బస్తాలను వేరేచోటికి తరలిస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. షార్ట్‌సర్య్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే వివిధ బ్యాంకు అధికారులు, బీమా కంపెనీ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించడంతోపాటు నష్టాన్ని అంచనా వేశారు. అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కూడా మంటలను ఆర్పేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. సంఘటనా స్థలానికి టీఆర్‌ఎస్ నేత జక్క రఘునందన్‌రెడ్డి పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నేతలు రమేష్‌గౌడ్, సత్యం, ఈశ్వర్‌రెడ్డి, బాలరాజుగౌడ్, భాస్కర్‌గౌడ్, రమణ తదితరులతో కలిసి సందర్శించి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన గురించి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ద్వారా ప్రభుత్వానికి నివేదించినట్టు జక్క రఘునందన్‌రెడ్డి తెలిపారు.

చిత్రాలు.. ..దగ్ధమవుతున్న పత్తి బేళ్లు, *మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది