క్రైమ్/లీగల్

నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, జూన్ 23: నిషేధిత మావోయిస్టు కొరియర్లు నలుగురిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్సై రవీందర్ తెలిపారు. ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద నలుగురు అనుమానితులు కనిపించడంతో పోలీసు సిబ్బందితో వారిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరు ములుగు జిల్లా తాడ్వాయ మండలంలోని కౌశెట్టివాయిలో 15 సంవత్సరాల క్రితం చత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చి మడకం రమేష్ (30), కురుసం రాకేష్ (25), మడవి కొసాల్ (30), మడకం జోగయ్య (60) జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వీరు నలుగురు ఆటోలో ప్రయాణిస్తుండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నాలుగు పేలుడు పదార్ధాలైన డిటొనేటర్, జిలెటిన్ స్టిక్స్ లభించాయని అన్నారు. వీరు గత కొద్ది రోజుల నుంచి మావోయిస్టు అగ్రనేతలైన హరిభూషణ్, దామోదర్‌లకు విప్లవ సామాగ్రి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.