క్రైమ్/లీగల్

విద్యుత్ తనిఖీ బృందంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, జూన్ 23: విద్యుత్ చౌర్యాన్ని గుర్తించేందుకోసం తనిఖీలకు వచ్చిన ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులపై, ఓ సర్పంచ్ కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడిచేయడంతో, ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఐదుగురు స్వల్ప గాయాలయ్యాయని, ట్రాన్స్‌కో ఏడీఏ నాందేవ్ ఆదివారం తెలిపారు. ట్రాన్స్‌కో అధికారులు తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు సెక్షన్ 135లో భాగంగా, ట్రాన్స్‌కో అధికారులు ఆధ్వర్యంలోతనిఖీల బృందం పని చేస్తోంది. ఆదివారం ఉదయం బిచ్కుంద ట్రాన్స్‌కో ఏడీఏ నాందేవ్ ఆధ్వర్యంలో బిచ్కుంద, పిట్లం, జుక్కల్, మండలాల ట్రాన్స్‌కో ఏఈలు తనిఖీ బృందంలో పాల్గొని, పెద్ద ఎక్లారా గ్రామంలో తనిఖీలు ముగించుకుని ఉదయం 7 గంటల ప్రాంతంలో సోమూర్ గ్రామానికి చేరుకున్నారు. సోమూర్ గ్రామ సర్పంచ్ ఇంట్లో విద్యుత్ చౌర్యం నిమిత్తం తనిఖీ చేస్తుండగా, విద్యుత్ తనిఖీ అధికారులపై కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసి పిడిగుద్దులు గుద్ది కర్రలతో బాదడంతో, జుక్కల్ ఏఈ నవీన్‌కు తీవ్రగాయాలయ్యాయ. అలాగే చంద్రకాంత్, ప్రవీణ్, దేవి ప్రసాద్, బాలాజీ, కెవి.రమణారావులకు స్వల్పంగా దెబ్బలు తగిలాయని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. రెండు ఇండ్లకు కలిసి ఒకే మీటర్ ఉండటం పట్ల ప్రతి నెలా వచ్చే బిల్లు తక్కువగా రావడం పట్ల అనుమానం వచ్చి ఇంట్లో తనిఖీలు చేశామన్నారు. ఇంట్లో అనుమతి లేకుండా ఎలా వచ్చారని ప్రశ్నిస్తూ దాడికి దిగినట్లు వివరించారు. గాయాలైన నవీన్‌ను మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్సఅందించారు.
ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో జిల్లా స్థాయి అధికారులు ఎస్‌ఈ శేషారావు, డీఈఈ సాంబశివరావు, ఏడీఏ నాందేవ్‌లతో పాటు జిల్లా ఏఈలు, యూనియన్ నాయకులు, ట్రాన్స్‌కో హెల్పర్లు దాదాపు 50 మంది వరకు పోలీస్టేషన్‌కు తరలి వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.