క్రైమ్/లీగల్

ఎంతమంది చనిపోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మెదడువాపువ్యాధి విజృంభణపై సుప్రీం కోర్టు స్పందించింది. బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌లో ఎన్‌సెఫాలిటీస్ సిండ్రోం(ఏఈఎస్)తో వంద మంది పిల్లలు మృతి చెందారు. యూపీలోనూ వ్యాధి తీవ్రత అధికంగానే ఉంది. వ్యాధి నివారణపై తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం, సంబంధిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో చేపట్టిన వైద్య సేవలు, పిల్లలకు పౌష్ఠికాహారం సరఫరా, శానిటేషన్‌కు సంబంధించి చేపట్టిన చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోనూ మెదడువాపువ్యాధి తీవ్ర రూపం దాల్చిందని న్యాయవాది ఒకరు కోర్టు దృష్టికి తెచ్చారు. పరిస్థితిపై తక్షణం నివేదిక అందించాలని యూపీ, బిహార్ రాష్ట్రాలను జస్టిస్ సంజీవ్‌కన్నా, బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలన్న కోర్టు తదపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. గత వారం రోజుల్లో ఏఈఏస్ వ్యాధిసోకి 126 మంది చిన్నారులు మృతి చెందారని మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మృతులందరూ ఏడాది నుంచి పదేళ్ల లోపువయస్కులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ మరణాలు పెరుగుతున్నాయని ఆయన బెంచ్‌కు తెలిపారు. ‘కేంద్రం, బిహార్, యూపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు నివారణకు ప్రభుత్వాలు సరైన రీతిలో చర్యలు చేపట్టలేదు. మెదడువాపువ్యాధితో ఏటా వేలాది మంది పిల్లలు మృత్యువాతపడుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠం నేర్వడం లేదు. దీని వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి’అని ఆయన ఆరోపించారు. బిహార్‌లోని ముజాఫర్‌పూర్ జిల్లాలోనే 126 మంది చిన్నారులు చనిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని న్యాయవాది స్పష్టం చేశారు. వైద్యులు అందుబాటులోలేకపోవడం, సరిపడా మందులు సఫరాలేకపోవడం, వైద్య పరికరాలు, ఐసీయూలు లేవన్న విషయం మీడియాలో కథనాలు వెలువడ్డాయని పిటిషనర్ వెల్లడించారు. గతంలో ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు యూపీలోని గోరఖ్‌పూర్‌లో ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు. కాగా బాధితకుటుంబం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని మనోహర్ ప్రతాప్ కోరారు. తక్షణం కేంద్ర వైద్యనిపుణులను ముజాఫర్‌పూర్‌కు పంపించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా 2008-14 మధ్య 44వేల మెదడువాపువ్యాధి కేసులు నమోదుకాగా, ఆరువేల మంది చనిపోయారు.