క్రైమ్/లీగల్

కూల్చివేతను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినపుడు 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదని అన్నారు. కూల్చివేత, కార్యాలయాల తరలింపుపై న్యాయోచితంగా వ్యవహరించాలని హైకోర్టు ఆనాడు స్పష్టం చేసింది. పదిరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 2016లో ఆనాటి ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ ఏ శంకరనారాయణతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజాహిత వ్యాజ్యాలపై ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. సచివాలయం కూల్చిలేతను సవాలు చేస్తూ అపుడు ఎమ్మెల్యేగా ఉన్న టీ జీవన్‌రెడ్డి, న్యాయవాది టీ రజనీకాంత్‌రెడ్డి, ఫోరం ఫర్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. జీవన్‌రెడ్డి తరఫున న్యాయవాది సత్యం తమ వాదనలు వినిపిస్తూ, ప్రస్తుత సచివాలయం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, వీటిలో చాలా భవనాలు 1985లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హయాంలో నిర్మించినవేనని ప్రస్తుత సెక్రటేరియట్ 30 సంవత్సరాల క్రితం నిర్మించిందేనని అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం
భవనాలు వాస్తు ప్రకారం లేవనే నెపంతో కూల్చివేయాలని అనుకోవడం అక్రమమని విన్నవించారు. అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రభుత్వం సెక్రటేరియట్ భవనాలు ఎందుకు కూల్చివేయాలనుకుంటోందో తెలుసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. అలాగే సచివాలయ సముదాయాన్ని కూల్చివేయడం, కార్యాలయాల తరలింపు వల్ల కలిగే భారీ వ్యయాన్ని ఎలా సమకూర్చుకుంటుందో కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ వాదనలు అన్నీ అపుడే జరిగాయి. సచివాలయం భవనాన్ని కూల్చబోమని సర్కార్ తరఫున అప్పటి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఏజీ వాంగ్మూలాన్ని గతంలో హైకోర్టు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మాట మార్చిందని, సచివాలయం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా సోమవారం నాడు జీవన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై తక్షణ విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ చేపడతామని తెలిపారు. మరోవైపు శాసనసభ నిర్మాణం విషయంలోనూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానిని అడ్డుకోవాలని కోరుతూ కొంత మంది విద్యార్థులు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని వారు హైకోర్టును కోరారు. ఈ పిటీషన్‌ను కూడా శుక్రవారం నాడు పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. ప్రస్తుత సచివాలయం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకుని ఉన్నభవనాలను కూల్చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సచివాలయం వెలుపల ఉన్న భవనాలను స్థలాలను కలిపేసుకోవడం ద్వారా వాస్తు దోషాలు లేకుండా కొత్త సచివాలయం నిర్మించి చతురస్రాకారంలో దానిని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.