క్రైమ్/లీగల్

తాళం పగులగొట్టి నగలు చోరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 24: ఇంటి తాళాలు పగులగొట్టి బిరువాలోని బంగారు, వెండి నగలను అపహరించుకు పోయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి వెంకటాద్రి టౌన్‌షిప్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్‌షిప్‌లోని ఓయూ కాలనీలో నివాసం ఉంటున్న బానాల అనిల్ రెడ్డి ఆదివారం ఉదయం తొమ్మిదిన గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయపురి కాలనీలోని ప్రిన్సిటన్ ఇంజనీరింగ్ కళాశాలకు పని నిమిత్తం వెళ్లినట్లు తెలిపారు. పనులు ముగించుకుని సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు తిరిగి ఇంటికి రాగా తాళాలు పగుల గొట్టి ఉన్నట్లు గమనించారని చెప్పారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బిరువా తలుపులు పగులగొట్టి అందులోని మూడు తులాల బంగారు నగలు, 60 తులాల వెండి నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. బాధితుడు బానాల అనిల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.