క్రైమ్/లీగల్

కరెంటు షాక్ తగిలి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, జూన్ 24: కరెంటు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని పర్సాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ శేఖర్‌గౌడ్ కథనం ప్రకారం.. కావలి శంకరమ్మ(35) సోమవారం ఉదయం ఇంటిని శుభ్రం చేస్తుండగా ఇంటికి ఉన్న మెట్లకు ఇనుపరాడ్లు ఉండటంతో వాటికి కరెంటు అర్తింగ్ రావడంతో కరెంటు తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం గమనించి ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుత్ షాక్‌తో
మహిళ మృతి
జీడిమెట్ల, జూన్ 24: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జిన్నారం మండలం, బొల్లారం గ్రామం, బీరప్ప బస్తీలో నివాసముండే మాలి లక్ష్మీ (25) మాలి అరున్ దంపతులు. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తారు. రోజూమాదిరిగానే లక్ష్మీ బాచుపల్లి శివారులోని ఎస్‌ఎంఎస్ పరిశ్రమ గేటు ఎదురుగా చిత్తు కాగితాలు ఎరుకునే క్రమంలో రోడ్డు ప్రక్కన విద్యుత్ తీగలు కింద పడి ఉన్నాయి. ఆదివారం వీచిన గాలికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. లక్ష్మీ కింద పడిన విద్యుత్ తీగలను గమనించకుండా తీగలను ప్రమాదవశాత్తు పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. తీవ్ర గాయాలకు గురైన లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది.