క్రైమ్/లీగల్

నరుూం అనుచరులపై పీడీ యాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూన్ 24: ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ భూకబ్జాలపై విచారణ కొనసాగిస్తున్న రాచకొండ పోలీసులు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నరుూం భార్యతో పాటుగా ఆయన అనుచరులు నలుగురిపై పీడీ యాక్టు నమోదుచేసినట్టు సోమవారం రాచకొండ కమిషనరేట్‌నుండి ప్రకటనవిడుదల చేసింది. నరుూం ముఖ్యఅనుచరుడు, 105 కేసులలో సూత్రధారి అయన భువనగిరి పట్టణానికే చెందిన పాశం శ్రీనివాస్ అలియాస్ శ్రీను, 87 కేసులలో నిందితుడైన భువనగిరి పట్టణానికి చెందిన మహ్మద్ నాసిర్ అలియాస్ నాసర్, ఐదు భూ ఆక్రమణ కేసులలో నిందితుడు, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఫహీం, 29 కేసులలో నిందితురాలైన నరుూం భార్య హసీనాబేతం అలియాస్ నసీమా అలియాస్ దివ్య అలియాస్ వదినమ్మలపై పోలీసులు పీడీ యాక్టు నమోదుచేసినట్టు వివరించారు. వీరంతా నరుూం ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి స్థలాల యజమానుల వివరాలను నరుూమొద్దీన్‌కు తెలియజేసేవారని పోలీసులు తెలియజేసారు. అనంతరం భూముల యజమానులను బెదిరించి ఎంతోకొంత చెల్లించలని డిమాండ్ చేయడం, కబ్జాకు పాల్పడటం వినకపోతే కిడ్నాప్‌లు, దాడులు చేసి బెదిరించేవారని తెలిపారు. అనంతరం అదే స్థలాన్ని వేరొకరికి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ముచేసుకోవడం చేసేవాడు. ఈ నేపథ్యంలో నరుూం తన అనుచరులకు కమీషన్ కింద కొంత డబ్బు ముట్టచెప్పేవాడని పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా నరుూమొద్దీన్ పేరుతో భూయజమానులను బెదిరించి, దాడులు చేసి అనుచరులు డబ్బులు వసూలు చేసేవారని తెలియజేసారు.
నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం వీరిపై కేసులు నమోదు చేయడంతో కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉండి తిరిగి భూకబ్జాలకు పాల్పడుతుండడంతో శాంతి భద్రతలను కాపాడే చర్యలలో బాగంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మెరకు వారిని అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదుచేసి కోర్టులో హజరుపర్చి రిమాండ్‌ చేసినట్టు తెలిపారు.