క్రైమ్/లీగల్

స్వయంగా వాదించుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 25: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌కు స్వయంగా వాదించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె వివాహం సందర్భంగా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఆరు నెలలపాటు సాధారణ సెలవు కావాలని ఆమె చేసిన అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది. జూలై 5న కోర్టుకు హాజరై తన వాదనలను స్వయంగా విన్నవించుకోవాలని హైకోర్టు సూచించింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎం.నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు జూలై 5న మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తన కేసుపై స్వయంగా వాదించుకునేందుకు నళినికి అనుమతి మంజూరు చేసింది. రాజీవ్ హత్య కేసులో నిందితురాలైన నళిని 27 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తోంది. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చేయనున్న నేపథ్యంలో ఆరు నెలలపాటు సాధారణ సెలవు కోరినందున తన కేసుపై స్వయంగా వాదించుకునేందుకు కోర్టుకు హాజరుపరచాలని వెల్లూరు మహిళా ప్రత్యేక జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేయాలని నళిని హైకోర్టును అభ్యర్థించింది. దీంతో నళిని చేసిన అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు నళిని స్వయంగా వాదించుకునేందుకు చేసిన వాదనను తోసిపుచ్చలేమని ఈనెల 11న పేర్కొంది. వాస్తవానికి జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని రెండేళ్లకు ఒకసారి నెల రోజుల పాటు సాధారణ సెలవు పెట్టేందుకు అవకాశం ఉంది. కానీ ఆమె 27 ఏళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నా ఎన్నడూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వీలుగా తనకు ఆరు నెలలపాటు సాధారణ సెలవు మంజూరు చేయాలని నళిని ఈ ఏడాది ఫిబ్రవరి 25న హైకోర్టును అభ్యర్థించింది. నళిని తల్లి కూడా మార్చి 22న ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్టును కోరింది. కానీ సంబంధిత అధికారులు మాత్రం వారు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకపోవడంతో చివరకు నళిని హైకోర్టును ఆశ్రయించింది.