క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: విశాఖ జిల్లా సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అవకతవకల్లేవని సర్టిఫై చేసేందుకు 200 గజాల స్థలాన్ని తనకు ఇవ్వాలని విశాఖ వన్‌టౌన్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి మోషే డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఆస్తిని మోషే సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే సొసైటీ లేఅవుట్‌లను పరిశీలించి తగిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారం కోఆపరేటివ్ సొసైటీ అధికారిది. ఈ పదవిలో ఉన్న మోషే ధ్రువీకరణ పత్రం కోరుతూ సింహాద్రి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. సొసైటీలో ఎటువంటి అక్రమాలు లేవని నిర్ధారించాలంటే అదే లేఅవుట్‌లో 200 చదరపు గజాల స్థలాన్ని తన సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారి సోదరుడు మల్లిఖార్జున రావు పేరిట స్థలం రిజిస్ట్రేషన్ చేసేందుకు మంగళవారం సిద్ధపడ్డారు. ఇదే సమయంలో ఏబీసీ అధికారులు దాడి చేసి నిందితుడితోపాటు సోదరుడు మల్లికార్జున రావును అదుపులోకి తీసుకున్నారు.
చిత్రం... ఏసీబీకి పట్టుబడిన కోపరేటివ్ సొసైటీల అధికారి మోషే, అతని సోదరుడు మల్లికార్జున రావు