క్రైమ్/లీగల్

ఈతకు వెళ్లి అన్నదమ్ముల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, జూన్ 25: ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన నర్రాముల నర్సింహ ఇద్దరు కుమారులు నర్రాముల శివకృష్ణ (22), నర్రాముల రాము (15) గ్రామశివారులోని వ్యవసాయబావి వద్దకు ఈతకు వెళ్లారు. చిన్నవాడు రాముకు ఈతరాకపోవడంతో నీటిలోపడి మునిగిపోతున్న సమయంలో పెద్దవాడు శివకృష్ణ తమ్మున్ని రక్షించడానికి ప్రయత్నించి తమ్మునితోపాటు తాను కూడా నీటిమునిగి మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు కళ్లముందే నీటిమునిగి మ్యత్యువాత పడడంతో నర్సింహ్మ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు అన్నదమ్ములు ఆకాల మరణం చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని జరిగిన సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టుఎస్‌ఐ సైదులు తెలిపారు.