క్రైమ్/లీగల్

చోరీలకు పాల్పడతున్న వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెంట్, జూన్ 26: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. భువనగిరి జిల్లా యాదిగిరిగుట్ట మండలం మల్లాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ (38) వృత్తిరీత్యా డ్రైవర్. ఉద్యోగం చేస్తు ఇళ్లల్లో దొంగతనలకు పాలుపడుతున్నట్లు తెలిపారు. అబ్దుల్‌పూర్‌మెట్, చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా చంద్రశేఖర్ ఇళ్లల్లో దొంగతనం చేస్తు 9.5 విలువైన బంగారు ఆభరణాలు నగదు దొంగలించినట్లు కేసులు నమోదు చేసుకోని రాచకొండ క్రైమ్ బృందం అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు నుంచి మూడు లక్షల రూపాయల నగదు, 9.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని డిమాండ్‌కు తరలించినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.