క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూన్ 26: స్థానిక దళితవాడలో ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. సంపంగి రమేష్‌తో రమాదేవికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. అత్త మరియమ్మ, ఆడపడుచు లత వారి కుటుంబ సభ్యులు. మంగళవారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై తన భార్య రమాదేవి మృతి చెందినట్లు రమేష్ బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పెనమలూరు ఇన్‌చార్జి సీఐ కనకారావు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. రమేష్, మరియమ్మ, లత తెలిపిన సమాచారం ప్రకారం రమాదేవి ఇంటి వెనక్కి వెళ్లి కేక వేసి పడిపోయింది. వెంటనే వెళ్లి చూస్తే కరెంట్ షాక్‌కు గురై కనిపించింది. రమాదేవి తల్లిదండ్రులు మాత్రం వరకట్నం కోసం తమ బిడ్డని వేధించి మరీ చంపారని కన్నీటి పర్యంతమయ్యారు. కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురమ్మని తమ కుమార్తెను వేధిస్తున్న అత్త, ఆడపడుచు చంపేసి కేసు నుండి తప్పించుకోడానికి విద్యుత్ షాక్‌కు గురైందని అబద్ధాలు చెపుతున్నారని ఆరోపించారు. దోషులకు తప్పకుండా కఠిన శిక్ష పడాలని వారు రోదిస్తున్నారు. వారింట్లో ఎప్పుడూ గొడవ పడుతుంటారని, రమాదేవి కేకలు, అరువులు వినించాయని, వారి గొడవలో జోక్యం చేసుకోవడం ఇష్టంలేక తాము పట్టించుకోలేదని చుట్టుపక్క ఇళ్ల వారు పోలీసులకు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద ఎస్‌ఐ వరలక్ష్మి కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని ఇన్‌చార్జి సీఐ కనకారావు వివరించారు.