క్రైమ్/లీగల్

హర్యానాలో డాక్టర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నల్ (హర్యానా), జూలై 7: ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతో ఓ యువకుడు ఇద్దరు స్నేహితులతో కలిసి డాక్టర్‌ను హత్య చేసిన ఘటన కర్నల్‌లో కలకలం రేపింది. డాక్టర్ రాజీవ్ గుప్తా (56) శనివారం తన ఆసుపత్రి నుంచి కారులో ఇం టికి బయలుదేరారు. చౌరా బజార్ ప్రాంతం లో మాస్క్ ధరించిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారుకు అడ్డంగా పెట్టారు. వెంటనే దుండగులు వాహనంలో కూర్చోని ఉన్న డాక్టర్‌పై కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు రాజీవ్ గుప్తా శరీరంలో దిగాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపి పారిపోతున్న ప్రధాన నిందితుడు పవన్, ఆయనకు సహకరించిన రమణ్, శివకుమార్‌ను హర్యా నా-ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ గుప్తాకు చెందిన ఆసుపత్రిలో నిందితుడు పవన్ డయాల్సీస్ టెక్నీషియన్‌గా పని చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్‌లో పవన్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి నిరుద్యోగిగా ఉంటున్న పవన్ మానసిక క్షోభకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. పవన్ వేరే ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకున్నా డాక్టరే అడ్డుపడుతున్నట్లు పవన్ అనుమానించాడు. కక్ష పెంచుకున్న పవన్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.