క్రైమ్/లీగల్

సుబ్రహ్మణ్య స్వామిపై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాష్‌పూర్/రాయ్‌పూర్, జూలై 7: ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ దఫా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో చత్తీస్‌గఢ్ పోలీసు స్టేషన్ పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలపై జాష్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జాష్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ శంకర్ లాల్ బాగెల్ తెలిపారు. ఐపీసీ-504, 505, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. రాహుల్‌పై తప్పుడు అభియోగం చేస్తున్నానన్న విషయం సుబ్రహ్మణ్య స్వామికీ తెలుసునని పవన్ అగర్వాల్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలతో పార్టీల మధ్య అనవసరంగా అగాధం ఏర్పడుతుందని, వైషమ్యాలు పెరుగుతాయని, తద్వారా ప్రజలను రెచ్చగొట్టినట్లు అవుతుందన్న సంగతీ స్వామికి తెలుసునని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల్లో విబేధాలు సృష్టించినట్లే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాఉండగా సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలను చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శైలేష్‌నితిన్ త్రివేది ఖండించారు. రాహుల్ గాంధీపై ఆరోపణలు చేసే అధికారం, హక్కు సుబ్రహ్మణ్య స్వామికి లేదన్నారు.