క్రైమ్/లీగల్

వివాహ వేడుకలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూలై 7: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఆదివారం తెల్లవారుజామున పెళ్లి కుమారుడి తరఫు బంధువులకు సంబంధించిన దాదాపు 60 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గుంతకల్లు 1వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గుంతకల్లు పట్టణంలోని పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటన్న ఫరూక్ రైల్వే డీజిల్‌షెడ్‌లో పని చేస్తున్నాడు. ఫరూక్, ముంతాజ్ దంపతుల కుమారుడు అస్లాంకు గుంతకల్లు పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. ఇందులో భాగంగా పెళ్లి కుమారుడి తల్లి ముంతాజ్ అక్కాచెల్లెళ్లైయిన కడపకు చెందిన మీరా, పర్వీన్, కదిరిన్, ఆయేషా శనివారం ఉదయం వివాహ వేదిక అయిన గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్‌కు చేరుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి వరకూ వివాహ వేడుకలో భాగంగా శుక్రానా తంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగారు నగలు ధరించి పాల్గొన్న మీరా, పర్వీన్, కదిరిన్, ఆయేషా ఆ తర్వాత వారి నగలను తీసి ఓ ట్రాలీ బ్యాగ్‌లో భద్రపరిచి నిద్రపోయారు. వారు ఆదివారం తెల్లవారుజామున గాఢనిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి నగలు ఉంచిన బ్యాగును అపహరించాడు. ఉదయం నిద్ర లేచిన బాధితులు నగలు చోరీకి గురైన విషయం తెలుసుకుని బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంతకల్లు 1వ పట్టణ సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి వివాహ వేడుక వేదికకు చేరుకుని చోరీపై ఆరా తీశారు. అలాగే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.