క్రైమ్/లీగల్

విద్యార్థుల ఆత్మహత్యలపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల మూలంగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కొండలరావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, జస్టిస్ బీఆర్ గావిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది కదా అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది మరిన్ని ఆధారాలను జోడిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు వివరించారు. అయినప్పటికీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ విచారణను ముగించారు.