క్రైమ్/లీగల్

విచారించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘ఆర్టికల్ 15’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. చిత్రంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికెట్ ఇచ్చిన అనుమతిని రద్దుచేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. చిత్రంలోని కొన్ని డైలాగులు ఓ కులాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పిటిషన్ ఆరోపించారు. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. చిత్ర పరిశ్రమకు సంబంధించే సంస్థను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. బ్రాహ్మిణ్ సమాజ్ ఆఫ్ ఇండియా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి నేమినాథ్ చతుర్వేది ఈ పిటిషన్ వేశారు. ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘ఆర్టిల్ 15’ జూన్ 28న విడుదలైంది. సంబంధిత అథారిటీని ఆశ్రయించాలని ధర్మాసనం సూచించడంతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు న్యాయవాది తెలిపారు. సీబీఎఫ్‌సీ ఆర్టికల్ 15కు జూన్ 18 ధృవీకరణ పత్రం మంజూరు చేసింది. బెనారస్ మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 1952 సినిమా ఆటోగ్రఫీ చట్టం కింద చిత్రానికి సర్ట్ఫికెట్ మంజూరు చేశారు. అయితే చిత్రంలోని కొన్ని వ్యాఖ్యలు ఓ కులాన్ని కించపరిచేలా ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ)ను చిత్ర నిర్మాతలు దుర్వినియోగం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. కులంపై అనుతి వ్యాఖ్యలు చేయడం ద్వారా దర్శక,నిర్మాతలు లబ్ధిపొందాలని చూస్తున్నారని తక్షణం సెన్సార్ బోర్డు సర్ట్ఫికెట్ రద్దుకు ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.