క్రైమ్/లీగల్

భద్రాచలం ఏజెన్సీలో సీపీఐ నేత హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్ : పోడు భూములకు సంబంధించి ఒకవైపు తెలంగాణలో పలుచోట్ల సాగుదారులు అటవీ అధికారులపై దాడులకు తెగబడుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో దళితుల చేతిలో ఒక గిరిజన నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోడు భూములకు సంబంధించి నెలకొన్న వివాదం చర్ల మండలం కుదునూరులో హత్యకు దారితీసింది. బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. చర్ల మండలం బోటుగూటెం రిజర్వ్ ఫారెస్టులో 2004 నుంచి గిరిజనులు, దళితులు కలిసి సుమారు 150 ఎకరాల్లో పోడు భూములు సాగు చేస్తున్నారు. తొలుత వారంతా ఐక్యంగా చెట్టుపుట్ట కొట్టుకొని భూములను సాగులోకి తెచ్చుకున్నారు. కాలక్రమంలో 2012 నుంచి ఆ భూములకు సంబంధించి గిరిజనులకు ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు మంజూరు చేసింది. కష్టించి భూములు సాగుచేసినా తమకు హక్కు పత్రాలు రాలేదని దళితులు గిరిజనులపై కక్ష పెంచుకున్నారు. ఈవిషయమై పలుమార్లు వివాదాలు చోటుచేసుకోగా గ్రామానికి చెందిన సీపీఐ నేత బూటారి రాఘవ గిరిజనుల పక్షాన నిలిచాడు. అదే పార్టీకి చెందిన మరో నాయకుడు ఐనవోలు పవన్‌కుమార్ దళితులకు అండగా ఉన్నాడు. పోడు భూములకు సంబంధించి రెండు వర్గాలు పలుమార్లు దుషణలు, గొడవలకు దిగాయి. దీంతో ఈ పంచాయితీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. గిరిజనులకు హక్కు పత్రాలు రావడంలో కీలకంగా వ్యవహరించి వారికి చేదోడువాదోడుగా నిలిచిన బూటారి రాఘవపై ప్రత్యర్థి వర్గం కక్ష పెంచుకుంది. ఆదివారం అర్ధరాత్రి రాఘవ మరో ఇద్దరు యువకులతో కలిసి ఆటోలో స్వగ్రామం వెళుతుండగా 18 మంది యువకులు ఆటోను అటకాయించి కర్రలు, ఇనుపరాడ్లతో రాఘవను కొట్టి దారుణంగా హత్య చేశారు. ఆటోలోని ఇద్దరు యువకులనూ తీవ్రంగా గాయపర్చారు. కలకలం రేపిన ఈ దాడి ఉద్రిక్తతలకు దారితీసింది. రాఘవ కుటుంబ సభ్యులు, ఆదివాసీలు ఆందోళనకు దిగారు. దళితులకు మద్దతిచ్చిన సీపీఐ నేత ఐనవోలు పవన్‌కుమార్ ఇంటి ముందు రాస్తారోకో చేశారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర ఆ గ్రామం వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘటనలో ప్రాథమికంగా 18మందిపై కేసులు నమోదు చేశామని, దోషులెవరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. నిందితులకు బెయిల్ కూడా రాకుండా కేసులు పక్కాగా నమోదు చేస్తామని, హతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చి, ఆందోళన విరమించాలని కోరారు.

చిత్రం...హత్యకు గురైన సీపీఐ గిరిజన నేత బూటారి రాఘవ