క్రైమ్/లీగల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 150 కిలోల బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు. సుమారు 150 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా శంషాబాద్‌లోని కార్గోలో ఉంచిన బంగారాన్ని అధికారులు కనుగొన్నారు. గత కొంత కాలంగా ఆర్బీఐ అనుమతి లేని సంస్థలు మలేషియా, సింగపూర్ తదితర ప్రాంతాల నుంచి బంగారం ఇక్కడి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అక్కడి నుంచి వచ్చే పార్శిళ్లను తనిఖీ చేయడంతో సొత్తు బయట పడింది. దానికి ఎలాంటి అనుమతులూ లేవని అధికారులు చెబుతున్నారు. ఎంత కాలం నుంచి ఈ అక్రమ రవాణా సాగుతుందోనన్న కోణంలో విచారణ సాగుతోంది. ఆర్కే డిజిటల్ అనే ఓ సంస్థ దీన్ని తీసుకొచ్చినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. దీని వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా అహ్మదాబాద్‌కు చెందిన పలువురు పెద్దలు కూడా దీని వెనుక ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.