క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 8: విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన జిలా లకేంద్రంలోని శంకర్‌విలాస్ సెంటర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం మోతె మండలం ఉర్లకొండ గ్రామానికి చెందిన చామకూరి సుధాకర్ (32) 2012లో చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్రాష్ట్ర బదిలీలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చి భార్య ఇద్దరు పిల్లలతో జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా ఆదివారం రాత్రి స్టేషన్ వాచ్ డ్యూటీ ముగించుకొని అర్ధరాత్రి సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. శంకర్ విలాస్ సెంటర్ సమీపంలో బుల్లెటు వాహనంపై అతిగా మద్యం సేవించి ముగ్గురు యువకులు అతివేగంగా వచ్చి కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో కానిస్టేబుల్ సుధాకర్ తలకు బలమైన గాయాలయ్యాయ. తొలుత చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుని భార్య రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు, సీఐ శివశంకర్‌లతో పాటు పలువురు పోలీసు అధికారులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున రూ.25వేల ఆర్థికసాయం అందించారు. జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్ సుధాకర్ మృతదేహానికి నివాళి అర్పించారు.

కానిస్టేబుల్ సుధాకర్ (ఫైల్‌ఫొటో)