క్రైమ్/లీగల్

అది ప్రభుత్వ భవనం కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకున్నందున దానిని ప్రభుత్వ భవనంగా ఎందుకు పరిగణించరాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన డివిజన్ బెంచ్ కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చడం సరికాదని దాఖలైన వేర్వేరు పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక భవనాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత దానిని పురావస్తు భవనంగా ఎలా పరిగణిస్తామని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా, పిటీషనర్ల తరఫున న్యాయవాది బీ రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ నవాబ్ ఫక్రూల్ ముల్క్ వారసులకు పరిహారం చెల్లించలేదని, భవన స్వాధీనం న్యాయబద్ధంగా జరగలేదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 1951లో దాఖలైన పిటీషన్‌పై ఇప్పటికీ న్యాయనిర్ణయం జరగలేదని పిటీషనర్ న్యాయవాది పేర్కొన్నారు. ఆ భవనం నవాబ్ ఎస్టేట్ అని, దాని బాధ్యుడ్ని కూడా నియమించారని అంటే దాని ఉద్ధేశ్యం వారసులకు ఇప్పటికీ ఆ భవనంపై హక్కు ఉందని అర్ధమని పేర్కొన్నారు. మరో పిటీషనర్ తరఫున కె రమాకాంతరెడ్డి హాజరయ్యారు. భవనాన్ని కూల్చివేయడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను ఉల్లంఘించడమేనని అన్నారు. ఎర్రమంజిల్ భవనం పురావస్తు భవనమేనని గుర్తించేందుకు వీలుగా 1995 అంతకంటే ముందు ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వులను, ఆదేశాలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ ఆదేశాలు అన్నీ 2015లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దయ్యాయని అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు చెప్పారు. 2017 హెరిటేజ్ యాక్టులో ఈ భవనం లేదని పేర్కొన్నారు.