క్రైమ్/లీగల్

పోలీసు విచారణకు శివాజీ గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మీడియా చానల్ టీవీ 9 కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గరుడ పురాణం శివాజీ గురువారం సైబరాబాద్ పోలీసుల విచారణకు డుమ్మాకొట్టారు. ఈనెల 11న విచారణకు రమ్మని నటుడు
శివాజీని పోలీసులు ఆదేశించారు. అయితే గురువారం హాజరు కావల్సిన శివాజీ తనకు సొంత పనులు ఉన్నందున రాలేకపోయానని సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. టీవీ 9 యాజమాన్యం అలంద సంస్థ నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్‌అవుట్ జారీ చేశారు. అయితే అమెరికా వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న శివాజీ గురించి ఎయిర్ పోర్టు అధికారులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శివాజీని దొరికిపోయాడు. అయితే ప్రశ్నించి వదిలేసిన పోలీసులు ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 42 సీఆర్పీసీ కింద అతడికి నోటీసులు ఇచ్చారు. అయితే తన కుమారుడు అమెరికా వెళ్తున్నందున విచారణకు హాజరుకాలేనని అతడు సమాచారం పంపాడు. ఇప్పటికే ఈ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు. హైకోర్టులో బెయిల్ కోసం రవిప్రకాశ్ ఆశ్రయించారు.