క్రైమ్/లీగల్

టిక్‌టాక్ సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 11: సెల్ఫీ, టిక్‌టాక్ వీడియో సరదాలకు ఓ యువకుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సరాదాగా చెరువులో స్నానానికని వెళ్లిన ఇద్దరు యువకులు.. సెల్ఫీ, టిక్‌టాక్ వీడియోలను తీస్తూ చెరువులోనే మునిగి ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సజ్జపురం గ్రామానికి చెందిన బేగరి నర్సింహులు (24) ఈనెల 8న దూలపల్లి గ్రామంలో నివాసముండే సమీప బంధువైన సోదరుడు ప్రశాంత్ వద్దకు వచ్చాడు. దూలపల్లిలోని తుమర్ చెరువులో స్నానానికని ప్రశాంత్, నర్సింహులు కలిసి వెళ్లారు. చెరువులో సరదాగా స్నానం చేస్తూ సెల్ఫీ వీడియోలతో పాటి టిక్‌టాక్ వీడియోలను తీసుకుంటున్నారు. ప్రశాంత్ సెల్ఫీ వీడియో తీస్తుండగా నర్సింహులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో భయపడిపోయిన ప్రశాంత్.. స్థానికులకు జరిగిన విషయాన్ని తెలుపగా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వచ్చి నర్సింహులు మృతదేహం కోసం గాలించారు. నర్సింహులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీసి కేసు ర్యాప్తు చేస్తున్నారు.