క్రైమ్/లీగల్

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి, జూలై 11: ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఒంగోలుకు వెడుతున్న ఆర్టీసీ బస్సు చీమకుర్తి మండలం తొర్రగూడిపాడు డొంక వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టడంతో బస్సులోప్రయాణం చేస్తున్న 24మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయడ్డారు. మరో 22మందికి స్వల్పగాయాలు అయ్యాయి. తీవ్రగాయాలైన వారిలో కనిగిరి మండలం పెదగొల్లపల్లికి చెందిన వేంపాటి నరసమ్మ, పోటు సుబ్బులు ఉన్నారు. చీమకుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కనిగిరి నుంచి ఒంగోలు వెడుతున్న కనిగిరి డిపో బస్సుడ్రైవరు రామారావుకు హఠాత్తుగా బీపీ పడిపోవటంతో చాకచాక్యంగా బస్సును చెట్టుకు ఢీకొట్టారు. బస్సులో ప్రయాణం చేస్తున్న 30మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలవగా, మరో 22మందికి స్వల్పగాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన ప్రయాణికులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.