క్రైమ్/లీగల్

వరకట్నం తేలేదన్న అక్కసుతో భార్య, కొడుకు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ జూలై 11 వరకట్న వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తి భార్యను, కన్నకొడుకును హత్యచేసి అనంతరం కిరోసిన్ పోసి కాల్చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నాగల్‌గిద్దా మండలం కరసుగుత్తి గ్రామంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరసుగుత్తి గ్రామానికి చెందిన చింతల వెంకట్‌రెడ్డితో బిజిల్ గ్రామం దేగ్లూర్ తాలుకా, నాందేడ్ జిల్లా వాసురాలు కవితతో 2009లో వివాహం జరిగింది. అప్పట్లో తల్లి దండ్రుల అన్ని విధాలుగా కట్నకానుకలు ఇచ్చిపెళ్ల్లి చేశారు. కొడుకు జన్మించిన తరువాత కొద్దిరోజులకు అదనపు కట్నం తెమ్మని భార్య కవితతో భర్త తరచూ గొడవపడే వాడు. బుధవారంనాడు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య కవిత (24)ను కొడుకు దినేష్‌రెడ్డి(4)ని హత్య చేసి కిరోసిన్ పోసి కాల్చేసి గుర్తు తెలియకుండా చేశాడు. గురువారంనాడు కవిత సోదరుడు హన్మరెడ్డి నాగల్‌గిద్దా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలకు పంచనామా చేసి పోస్టు మాస్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఖేడ్ డీఎస్పి సత్యనారాయణరాజు, ఖేడ్ సీఐ వెంకటేశ్వరావు పరిశీలించారు.