క్రైమ్/లీగల్

ప్లాట్‌ఫాం పైకి దూసుకువచ్చిన బస్సు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూలై 12: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో బస్సు కోసం వేచి కూర్చుని ఉన్న ప్రయాణికునిపైకి ప్లాట్‌ఫామ్ దాటి బస్సు దూసుకుని వచ్చి ఢీకొట్టడంతో ఒక ప్రయాణికుడు మరణించాడు. కామారెడ్డి ఎస్‌ఐ. గోవింద్ కథనం ప్రకారం కామారెడ్డి డిపోకు చెందిన ఏపీ 29జడ్ 3315 నంబర్‌గల ఎక్స్‌ప్రెస్ బస్సు బస్టాండ్‌లోని ప్లాట్ ఫామ్ నెంబర్ వన్ పైకి దూసుకుని వచ్చింది. అక్కడ ఉన్న ప్రయాణికుడు మాచారెడ్డి మండలం పర్ధిపేట్ గ్రామానికి చెందిన జి.లక్ష్మణ్ (35)ను ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు తగిలాయి. హైదరాబాద్‌లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మణ్ తన స్వగ్రామం అయిన పర్దిపేట్ వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్టాండ్‌లో హైదరాబాద్ బస్సు కోసం కూర్చుని వేచి చూస్తుండగా, అదే సమయంలో జెబీఎస్‌కు వెళ్లేందుకు కామారెడ్డి డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సును, బస్సు డ్రైవర్ ఇంద్రాసేనారెడ్డి ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకుని వస్తున్న సమయంలో, బస్సు వేగంగా ఉండటంతో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల బస్సు అదుపు తప్పి ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కిందని, ప్లాట్‌పామ్‌పై వెయింటింగ్ టేబుల్‌పై కూర్చుని ఉన్న లక్ష్మణ్‌ను బస్సు ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. సంఘటనకు బాధ్యుడైన బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుని కుటుంబీకులు, బంధువులు బస్టాండ్‌కు చేరుకుని మృతుని కుటుంభీకునికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు వచ్చి లక్ష్మణ్ కుటుంబానికి తమ శాఖ నుండి అందాల్సిన ఆర్థిక సహాయం అందించి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు రాస్తారోకో విరమించారు. గతంలో కూడా ఒకసారి బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకుపోయిన సంఘటన ఉన్నప్పటికీ, ఇంత నిర్లక్ష్యం ఏమిటని ప్రయాణికులు మండిపడ్తున్నారు. చాలాసార్లు ప్లాట్‌ఫామ్‌పైకి పోటీ పడి బస్సులను వేగంగా తీసుకుని రావడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం... ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన బస్సు ఢీకొట్టడంతో మృతి చెందిన జి.లక్ష్మణ్