క్రైమ్/లీగల్

ఇన్‌ఫార్మర్ నెపంతో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలం బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మూడు రోజుల అనంతరం శ్రీనివాసరావును నరికి చంపేసిన మావోయిస్టులు శుక్రవారం మధ్యాహ్న సమయంలో తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలోని రహదారిపై మృతదేహాన్ని పడేశారు. మృతదేహం ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు, స్థానికులు మృతుడిని ఎంపీటీసీ శ్రీనివాసరావుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా కమిటీ పేరుతో ఒక లేఖను మావోయిస్టులు వదిలివెళ్లారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆదివాసీల భూములను అన్యాయంగా గుంజుకుంటున్నాడని, ఎదురు తిరిగితే పోలీసు కేసులు పెట్టిస్తున్నాడని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను తయారు చేస్తూ మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు యత్నిస్తున్నాడని, దళాల సమాచారాన్ని తెలుసుకుంటూ పోలీసులకు చేరవేస్తున్నాడని, అందుకే అతన్ని హతం చేస్తున్నామని చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖను మావోయిస్టులు మృతదేహం వద్ద వదిలి వెళ్లారు. ఈ ఘటనతో ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
అధికార పార్టీ ఎంపీటీసీని హతమార్చడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం ఏజెన్సీలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నవారు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ మావోయిస్టుల చర్యను తీవ్రంగా ఖండించారు.
ఒక రైతుని చంపడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. పోలీసులతో మృతుడికి ఎటువంటి సంబంధం లేదని, ఆ ప్రాంతంలో అతను మంచి రైతుగా గుర్తింపు పొందాడని, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.

చిత్రం... మావోల చేతిలో హత్యకు గురైన శ్రీనివాసరావు మృతదేహం, మావోలు వదిలిన లేఖ