క్రైమ్/లీగల్

యూపీ వయా విశాఖ మన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూలై 12: విశాఖ ఏజెన్సీ నుండి ఉత్తరప్రదేశ్‌కు భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని నీలంపేట వద్ద శుక్రవారం ఉదయం రెండు వ్యాన్లలో తరలిస్తున్న సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే 1386 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఏఈఎస్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీస్ బృందం ఇక్కడకు సమీపంలోని నీలంపేట వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. సీలేరు వైపు నుండి వస్తున్న రెండు ఐషర్ వ్యాన్లను ఆపి తనిఖీ చేయగా ఒక ఖాళీ వ్యాన్‌లో బాడీ కింద అమర్చిన ప్రత్యేక అరలో దాచిన గంజాయి ఫ్యాకెట్లను గుర్తించారు. రెండవ వ్యాన్‌లో బంగాళాదుంపల బస్తాల కింద అమర్చిన అర లో దాచిన గంజాయి ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పై రెండు వ్యాన్లలో దొరికిన గంజాయి 1,386 కిలోలుగా నిర్ధారించినట్లు తెలిపారు. గంజాయి వ్యాన్‌లో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మధురై జిల్లాకు చెందిన ముఖేష్ (38, డ్రైవర్), ప్రకాష్ (22, క్లీనర్), హర్యానా రాష్ట్రం వడల్ జిల్లా కు చెందిన నేత్రపాల్ (27,డ్రైవర్), హరి ఓం(31,క్లీనర్)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నాలుగు సెల్‌ఫో న్లు, రూ.4,800 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏఈఎస్ తెలిపారు. జీకేవీధి మండలం దారకొండ నుండి ఈ గంజాయిని యూపీలోని మధురైకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారన్నారు. వ్యాన్‌లో ప్ర త్యేకంగా తయారు చేసిన అరల్లో అనుమానం రాకుండా దాచిన గంజాయిని గుర్తించామన్నారు. నిందితులను అరె స్ట చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నామని ఏఈఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ కామేశ్వరరావు, ఎస్సై ధర్మారావు, సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రాలు.. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న గంజాయి
* లారీలో ప్రత్యేకంగా అమర్చిన అరలో దాచిన గంజాయి