క్రైమ్/లీగల్

మా రాజీనామాలు ఆమోదించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలను కర్నాటక స్పీకర్ ఆమోదించడం లేదని మరో ఐదుగురు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె. సుధీర్, ఎన్. నాగరాజ్, మునిరత్న, రోషన్ బేగ్ శనివారం సుప్రీంను ఆశ్రయించారు. ఇలాఉండగా ఇదివరకే 10 మంది తిరుగుబాటు కాంగ్రెస్, జెడీ(ఎస్) ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, వాటిని స్పీకర్ ఆమోదించక పోవడంతో వారు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం, వాటిని కూడా స్పీకర్ పక్కన పెట్టడంతో వారు సుప్రీం కోర్టులో ఇదివరకే దాఖలైన పిటీషన్‌లో ఇంప్లీడ్ అయ్యారు. తొలుత 10 మంది ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, రమేష్ జర్కిహోలి, బైరటి బస్వరాజ్, బీసీ పాటిల్, ఎస్‌టీ సోమశేఖర్, అర్‌బెయిల్ శివరామ హెబ్బార్, మహేశ్ కుమతల్లి, కె. గోపయ్య, ఎహెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.