క్రైమ్/లీగల్

పథకం ప్రకారమే హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాములను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని.. పక్కా పథకం ప్రకారం రాంప్రసాద్‌ను హతమార్చారని, హత్యకు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించారని డీసీపీ తెలిపారు. ఈ హత్య కేసులో తన ప్రమేయం లేకుండా ఉండేందుకు సత్యం పలు జాగ్రత్తలు తీసుకున్న పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. రాంప్రసాద్, కోగంటి సత్యం కూడా చాలా సంవత్సరాలు కలిసి వ్యాపారం చేశారు. ఈ నేపథ్యంలో కోగంటి సత్యంకు రూ.70 కోట్లు రాంప్రసాద్ బాకీ పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో రూ.23 కోట్లు చెల్లించేలా ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందని, చెల్లించాల్సిన రుణాన్ని భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చలేక కోగంటి సత్యం ఆగ్రహంతో కక్ష కట్టినట్లు చెప్పారు. ఈ హత్య కోసం రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు సత్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులున్నారని వారిలో ఆరుగురు పరారీలో ఉన్నారని కోగంటి సత్యనారాయణ ఆలియాస్ సత్యం, టెక్యం శ్యామ్ సుందర్, పులివర్తి బాల నాగా అంజనేయ ప్రసాద్, మండే ప్రితం అలియాస్ బాజీ, పులివర్తి రామును అరెస్టు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.