జాతీయ వార్తలు

అనుమతులు లేకుండా కడుతుంటే ఏం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: తూర్పు గోదావరి జిల్లాలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు లేకుండా కడుతుంటే ఏం చేస్తున్నారని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరంలో భాగంగా నిర్మిస్తున్నామని తమకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్టు కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీకి తెలిపింది. ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుకు డిపీఆర్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో భాగం ఎలా అవుతుందని ఎన్జీటీ ప్రశ్నించింది. పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని జమ్ముల చౌదరయ్య, మెడిచర్ల సత్యనారాయణ, రామకృష్ట దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ సోమవారం విచారించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ శాఖకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని గిరిజన శాఖ చెప్పిన విషయాన్ని ఎన్జీటీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, పర్యావరణ అనమతులు తీసుకోకుండా పురుషోత్తపట్నం నిర్మాణం చేపట్టారని మండిపడింది. ఇది పోలవరంలో అంతర్భాగం కాదని, కేంద్ర జల వనరుల శాఖ అఫిడవిట్ చెబుతోందని ఎన్జీటీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బెంజ్ స్పష్ట చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పురుషొత్తపట్నం నిర్మాణం వుంటే పనులు ఆపివేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇచ్చింది. 2017లో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు ఏ చేస్తున్నారని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లో తీసుకున్న చర్యలను నివేదిస్తామని, అందుకుగాను సమయం కావాలని పర్యావరణ శాఖ ఎన్జీటీలోని బెంచ్‌ను కోరింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది.