క్రైమ్/లీగల్

బాలకార్మికులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 15: జిల్లా బాలల రక్షణ అధికారులు సోమవారం మేడ్చల్ మండలం డబిల్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గల శ్రీరామా స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ కంపెనీపై దాడి నిర్వహించి 15 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలో బాలకార్మికులు పనిచేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి నిర్వహించి వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. బాలకార్మికులు సంజయ్(10), దేవన్(13), బుద్రాం(17), రఘునందన్(16), సునరాం(16), సుధన్(16), లక్ష్మణ్(16), అభిషేక్(16), బిద్వార్(16), ప్రిన్స్ ఈశ్వర్(16), సునిల్(14), రవి(17), గంగారం సింకు(15), తురి సింకు(14), గంగారం బీమారం(14)లకు విముక్తి కల్పించారు. బాలకార్మికులంతా జార్ఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందినవారు. నిబంధనలకు వ్యతిరేకంగా బాలకార్మికులతో పనిచేయిస్తున్న శ్రీరామా స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీసీపీయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.