క్రైమ్/లీగల్

గ్యాస్ లీక్ చేసుకొని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, జూలై 15: గ్యాస్ లీక్ చేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలిస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ్‌నగర్ కాలనీ రోడ్డు నెంబరు-3లో నివాసముండే అనురాగ్ (30) అనే యవకుడు వృత్తి రీత్యా ప్రైవేట్ ఉద్యోగి. తల్లిదండ్రులు, బంధువులు తిరుపతికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదే అదునుగా భావించి ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను ఓపెన్ చేసి నోట్లో పైపును పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు గ్యాస్ వాసన రావడంతో పలువురు వెళ్లి చుశారు. అప్పటికే మృతిచెందిన అనురాగ్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతుడు ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.