క్రైమ్/లీగల్

గర్భస్రావ చట్ట పునఃపరిశీలనకు సుప్రీం అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: గర్భస్రావ చట్టంలోని అంశాలను పునఃపరిశీలించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ చట్టం మహిళల స్వేచ్ఛకు, పునరోత్పత్తి అంశాలకు ఆటంకం కలిగిస్తున్నదంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి దీపక్ గుప్తాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంపీటీ) చట్టంలోని 3(2)(ఏ), 3(2)(బీ) అంశాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గర్భస్థ పిండం సరిగ్గా లేకపోవడం లేదా తల్లి ఆరోగ్యానికి లేదా ప్రాణానికి హాని కలిగించేలా ఉండడం వంటి పరిస్థితుల్లో గర్భస్రావానికి ఎంపీటీ చట్టం అనుమతిస్తున్నది. అయితే, ఈ చట్టంలోని కొన్ని అంశాలు మహిళల స్వేచ్ఛకు, వారి ఆరోగ్యానికి భంగం కలిగించేవిలా ఉన్నాయని ముగ్గురు మహిళలు, స్వాతి అగర్వాల్, గరిమా సెక్సేరియా, ప్రాచి వాట్స్, సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం కేంద్రాన్ని వివరణ కోరిం ది. పిల్‌లో పేర్కొన్న అభ్యంతరాలను మరోసారి పరిశీలించి, ఎంపీటీ చట్టంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలు ఏవైనా ఉన్నాయేమో చూసేందుకు అంగీకరించింది. ఈ చట్టంపై కేంద్ర సర్కారు నుంచి వివరణ అందిన తర్వాత, మిగతా అంశాలను విచారిస్తామని తెలిపింది. ఎంటీపీ చట్టాన్ని అడ్డుపెట్టుకొని, మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించేలా ఇష్టానుసారంగా అబార్షన్లు చేయించడాన్ని పిల్ వేసిన ముగ్గురు మహిళలు కోర్టు దృష్టికి తెచ్చారు. పునరోత్పత్తికి సంబంధించిన ఎంపిక అనేది మహిళలకు లేకుండా పోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉన్న సేచ్ఛను ఈ చట్టంలోని కొన్ని అంశాలు హరించి వేస్తున్నాయని పేర్కొన్నారు. 12 వారాలకు మించని గర్భస్థ పిండాన్ని తొలగించేందుకు తగిన కారణాలను పేర్కొంటూ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైనా గర్భస్రావం చేయవచ్చని ఎంటీపీ చట్టం పేర్కొంటున్నది. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం, కొన్ని అంశాలను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా గర్భస్రావాలు చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. దీని వల్ల మహిళల ఆరోగ్యం దారణంగా దెబ్బతింటున్నది. అంతేగాక, ఎన్నో సందర్భాల్లో వారు శారీరక, మానసిక సమతుల్యం కోల్పోతున్నారు. అమ్మాయి పుడుతుందని తెలిస్తే, గర్భస్రావం చేయించడం సర్వసాధారణంగా మారింది. ‘పునరోత్పత్తి’కి సంబంధించిన స్వేచ్ఛను మహిళలు లేకుండా చేస్తున్న ఈ చట్టంలోని పలు అంశాలను పరిశీలించి, వాటిని సవరించాలని పిల్‌లో ముగ్గురు మహిళలు కోర్టును కోరారు. ఎంటీపీ చట్టానికి పదును పెంచాలని, కఠినతరమైన ప్రొవిజన్స్ ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఎంటీపీ చట్టాన్ని పునఃపరిశీలనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ అందిన తర్వాత కోర్టు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది.