క్రైమ్/లీగల్

ఖర్చుల కింద రూ.10 లక్షలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: పోటీ పరీక్షలను లోపరహితంగా నిర్వహించేందుకు వీలుగా తగు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాము నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి అయ్యే ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జిఎస్ సింఘ్వి సారథ్యంలో ఏడుగురు సభ్యులతో ఈ ఏడాది మే 9న సుప్రీం కోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా 2017 సంవత్సరంలో నిర్వహించిన స్ట్ఫా సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) ప్రశ్నా పత్రం లీక్ కావడంపై విచారణ ప్రారంభమైంది. న్యాయమూర్తులు ఎస్‌ఏ బొబ్డె, బీఆర్ గవాయితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.