క్రైమ్/లీగల్

ఆరు నెలలు గడువు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: బాబ్రీ మసీదు కూల్చి వేసిన ఘటనపై విచారణ ముగించేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ సుప్రీం కోర్టును కోరారు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన కేసులో బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులపై ప్రత్యేక న్యాయమూర్తి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30న తాను పదవీ విరమణ చేయనున్నట్లు న్యాయమూర్తి యాదవ్ ఇటీవల సుప్రీంకు లేఖ రాశారు.
ఇలాఉండగా 2017 సంవత్సరం ఏప్రిల్ 19న సర్వోన్నత న్యాయ స్థానం ఈ కేసుపై విచారణను రెండేళ్ళలో ముగించాలని ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. ఈ అంశం సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు కేసు వచ్చింది. కేసును విచారణ జరుపుతున్న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ చేయనున్నందున ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు?, కేసు విచారణ ముగిసేంత వరకూ పదవీ కాలాన్ని పెంచడం జరుగుతున్నదా? అనే అంశంపై ఈ నెల 19వ తేదీలోగా స్పష్టతనివ్వాలని బెంచ్ ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్ సింగ్ లోగడ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు కూల్చి వేసిన (1992 డిసెంబర్ 6న) ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన గవర్నర్‌గా పదవిలో ఉన్నంత కాలం మినహాయింపు ఉంటుందని లోగడ కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వారిపై ప్రతి రోజూ విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్ తెలిపారు. అయోధ్యలోని వివాదస్పద బాబ్రీ మసీదు కూల్చి వేసిన కేసులో ప్రధాన కుట్రదారులుగా ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌ను చేర్చిన సంగతి తెలిసిందే.