క్రైమ్/లీగల్

వారి వాదన వింటాం: సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్-జెడీ(ఎస్) తిరుగుబాటు ఎమ్మెల్యేల వాదన వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. అధికార కాంగ్రెస్-జెడీ(ఎస్) ఎమ్మెల్యేల రాజీనామాల పర్వంతో కర్నాటక ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను ఆదేశించాల్సిందిగా కోరుతూ ఇదివరకే కాంగ్రెస్-జేడీ(ఎస్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా, తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె. సుధాకర్, ఎన్. నాగరాజ్, మునిరత్న, రోషన్ బేగ్ కూడా తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంలేదని పిటీషన్ దాఖలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన కేసులోనే వీరి పిటీషన్‌ను చేర్చి (ఇంప్లీడ్) విచారణ కొనసాగిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్వర్యంలోని బెంచ్ తెలిపింది. అంతకు ముందు 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, రమేష్ జార్కిహోలి, బైరాటి బస్వరాజ్, బీసీ పాటిల్, ఎస్‌టి సోమశేఖర్, అర్బెల్ శివరాం హెబ్బార్, మహేష్ కుమతల్లి, కె. గోపాలయ్య, ఏహెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్-జెడీ(ఎస్) ఎమ్మెల్యేలు 15 మంది రాజీనామా చేయడంతో కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామికి అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం తగ్గి సంక్షోభంలో పడింది. అయితే ఈ నెల 16వ తేదీలోగా ఈ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడం గానీ, వారి సభ్యత్వాలను రద్దు చేయడం వంటి చర్య గానీ తీసుకోరాదని సుప్రీం కోర్టు కర్నాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్‌ను ఆదేశించింది.