క్రైమ్/లీగల్

సీఐడీ కేసులో అగ్రిగోల్డ్ డైరెక్టర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 15: వివి ధ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు ఆధారం గా ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా హేమసుందర వరప్రసాద్ ను సీఐడీ పోలీసులు సోమవారం అరె స్టు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తంపట్నం సుగాలీ కాలనీకి చెందిన కె మంట్రు నాయక్ అనే వ్యక్తి ఫిర్యాదుపై ఈ ఏడాది ఏప్రిల్ 1న కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సిఐడి అధికారులు ఒక ప్రకటనతో తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా ఉన్న అవ్వా హేమసుందర వరప్రసాద్ అలియాస్ లక్ష్మీ నరసింహ భారతి అలియాస్ అవ్వా లక్ష్మీ నరసింహ ప్రసాద్ శర్మ అలియాస్ శ్రీ లక్ష్మీ నృసింహ భారతి తదితర పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు. అగ్రిగోల్డ్ కేసులో ఆరో నిందితుడైన అవ్వా 2005-2010 మధ్యకాలంలో కృష్ణాజిల్లా విజయవాడలోని పటమట, గుణదల, అదేవిధంగా నూజివీడు, గన్నవరం, కంకిపాడు తదితర చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు స్ధిరాస్తులు కూడబెట్టినట్లు సిఐడి అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. అయా పేర్లతో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి రూ.7.32కోట్లు విలువ చేసే ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. అదేవిధంగా నిందితుడు 2010లో మందడం గ్రామంలో ఆరు ఎకరాల 43సెంట్లు స్ధలం కొనుగోలు చేశాడు. దీన్ని ఆస్తుల ఎటాచ్‌మెంట్ నుంచి తప్పించేందుకు 2014లో వంగల హరికృష్ణ అనే బినామీ పేరుకు బదలాయించాడు. నిందితుడిని అరెస్టు చేసిన సిఐడి అధికారులు నకిలీ గుర్తింపు పత్రాలు, డాక్యుమెంట్లు సీజ్ చేసి నిందితునితో సహా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండు నిమిత్తం జైలుకు తరలించారు.