క్రైమ్/లీగల్

నగరంలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 15: నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడిపేవారిపై కొరఢా ఝలిపించే క్రమంలో తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నగరంలో ఘాట్‌రోడ్డు టోల్‌గేటు, ఆర్టీసి వర్క్‌షాపు రోడ్డు, డీసీపీ బంగ్లా, మధురానగర్ జంక్షన్, బుడమేరు బ్రిడ్జి, చౌదరి హోటల్, కామయ్యతోపు సెంటర్, ఎనికేపాడు 100అడుగుల రోడ్డు, మధర్ ధెరిస్సా విగ్రహం, పడవలరేవు, నేతాజీ వంతెన, గన్నవరం సెంటర్ తదితర ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 136 మోటారు సైకిళ్ళు, 16 ఆటోలు, ఏడు కార్లు, ఒక వ్యాన్ మొత్తం 160 వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 112 మందిని అదుపులోకి తీసుకుని వీరందరికీ సోమవారం సాయంత్రం బందరురోడ్డులోని కెఎస్ వ్యాస్ కాంప్లెక్స్‌లో ట్రాఫిక్ ఇన్‌ఛార్జి డీసీపీ ఎస్‌వి మాధవ్‌రెడ్డి, ఏసీపీ నాగరాజురెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు.