క్రైమ్/లీగల్

యువకుడి వేధింపులు..బాలిక ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జూలై 16: ఆకతాయి వేధింపులు తాళలేక, మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జిల్లేడుచౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన రాజేశ్వరి(15) అనే బాలిక, పెద్దఎల్కిచర్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నరేష్ (24) అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో తరచూ బాలికను వేధించేవాడని, ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో కొద్ది రోజుల క్రితం నరేష్‌ను మందలించింది. అతను వినకుండా తనను ప్రేమించాలని బాలిక వెంటపడసాగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు.