క్రైమ్/లీగల్

పిల్లలతో వెట్టిచాకిరి..11 మంది అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, రాజేంద్రనగర్, జూలై 16: ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చిన్న పిల్లలను పనిలో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయిస్తున్న ఫ్యాక్టరీపై రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్ పేరుతో రాచకొండ పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు ఉమ్మడిగా నిర్వహించిన దాడులలో సుమారు 54 మంది చిన్న పిల్లలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని పనిలో పెట్టుకున్న 11 మందిపై కేసు నమోదు కాగా తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఎల్బీనగర్ రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన అస్లాంతో పాటు మరో పది మంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్ నగర శివారులో అక్రమంగా నడుస్తున్న చిన్న చిన్న ఇండస్ట్రీస్ యజమానులను కలసి తమ వద్ద కార్మికులు ఉన్నారని ఒప్పందం కుదుర్చుకుంటారు. బీహార్‌లో ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబాలను గుర్తించి తల్లి దండ్రులకు డబ్బులు అధికంగా ఇస్తామని నమ్మించి వారి పిల్లలను నగరానికి తరలించి బాలకార్మికులుగా తయారు చేస్తున్నారు. వీరి గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు రెవిన్యూ అధికారుల సహకారంతో ఈనెల 12న బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న గాజుల తయారీ దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈదాడులలో 10 నుంచి 16 ఏళ్ల వయసున్న 54 మంది బాల కార్మికులను గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి అందుకు బాధ్యులైన 11 మందిపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ వెల్లడించారు. బీహార్ ప్రాంతానికి చెందిన కలెక్టర్‌తో మాట్లాడి 54 మంది బాలకార్మికులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీపీ వివరించారు. చిన్నారులను బాలకార్మికులుగా తయారుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రిత్ సింగ్, ఏసీపీ, గాంధీ నారాయణ, ఇన్స్‌పెక్టర్ సైదులు పాల్గొన్నారు.
కేసు నమోదు
బాల కార్మికులతో పని చేయించుకుంటున్న వారిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. కాటేదాన్ పారిశ్రామికవాడలో 18 మంది బాల కార్మికులతో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయించుకుంటున్న విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. బాల కార్మికులను సంరక్షణ గృహానికి తరలించారు.